తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR MET HC CJ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్​ సమావేశం - CM KCR meeting with hc cj

CM KCR MET HC CJ: సీఎం కేసీఆర్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సతీష్​ చంద్ర శర్మతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ నెలలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్ర న్యాయాధికారుల సదస్సుపై ఆయనతో చర్చించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్​ సమావేశం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్​ సమావేశం

By

Published : Apr 13, 2022, 5:39 AM IST

CM KCR MET HC CJ: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్​ చంద్ర శర్మతో సమావేశం అయ్యారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం.. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని సీజే నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర న్యాయాధికారుల సదస్సు జరగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.

రైతులకు భరోసా..

అంతకుముందు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్​ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్‌కు రూ.1960 చొప్పున ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని అన్నారు. నేటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి:

యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: కేసీఆర్​

'ఉద్యోగులకు లంచ్​ బ్రేక్​ అరగంటే..'

ABOUT THE AUTHOR

...view details