రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ దృష్ట్యా అధికారులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ - అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
20:53 October 05
రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీ దృష్ట్యా అధికారులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
నీటి పారుదలశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమవేశమయ్యారు. అధికారులు, ఇంజినీర్లతో ప్రగతిభవన్లో సమీక్షించారు. మంగళవారం అపెక్స్ కౌన్సిల్ భేటీ దృష్ట్యా పలు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వనరుల పంపకం, ఏపీలో నీటి పారుదల ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై... భేటీకి ఎలా సన్నద్ధత కావాలనే అంశాలపై అధికారులతో చర్చించారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా....... అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలపై.. అత్యున్నత మండలి మంగళవారం హస్తినలో సమావేశం కానుంది. వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునేందుకు... దేవునితోనైనా కొట్లాడేందుకు సిద్ధమన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు ధీటైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. అటు..ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ వాదనలకు గట్టిగా జవాబు ఇవ్వాలని..... భావిస్తోంది. అపెక్స్ కమిటీ భేటీలో ఆంధ్రప్రదేశ్ వాదనలను..... ప్రజెంటేషన్ రూపంలో ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.