తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం - తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం

మధ్యాహ్నం రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైని ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని.. తమిళిసైకి అందించారు.

CM KCR meeting with Governor Tamilisai
గవర్నర్​ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం

By

Published : Mar 4, 2020, 5:23 PM IST

బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను కలిశారు. మధ్యాహ్నం రాజ్​భవన్​కు వెళ్లిన సీఎం.. గవర్నర్​తో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో తొలిరోజైన శుక్రవారం ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని.. తమిళిసైకి అందించారు. ఇతర అంశాలపైనా ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ప్రత్యేకించి కరోనా వైరస్ నియంత్రణా చర్యలు, ముందుజాగ్రత్త చర్యలను గవర్నర్​కు ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది.

గవర్నర్​ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం

ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం

ABOUT THE AUTHOR

...view details