తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త చట్టాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం - revenue act

కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపర్చాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రగతి భవన్ వేదికగా కలెక్టర్లతో ఎనిమిదిన్నర గంటలకు పైగా సీఎం సమావేశమయ్యారు. నూతన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలపై భేటీలో విస్తృతంగా చర్చించారు.

కొత్త చట్టాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

By

Published : Aug 20, 2019, 11:58 PM IST

కొత్త చట్టాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం

ప్రగతిభవన్​ వేదికగా జిల్లా పాలనాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. నూతన పంచాయతీరాజ్​, పురపాలక చట్టాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పగించిన బాధ్యతలు, విధులతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం... తదితర అంశాల గురించి సీఎం వివరించారు. త్వరలో చేపట్టనున్న 60 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు.

స్థానిక సంస్థలకు నిధులు సమకూర్చాక ప్రణాళిక అమలు చేస్తామన్న సీఎం... అమలు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కొత్త చట్టాల రూపకల్పనకు సంబంధించి తన ఆలోచనలను వివరించారు. కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని తెలిపారు. మూడు కొత్త చట్టాలను పటిష్ఠంగా అమలు చేసి గుణాత్మక మార్పు తీసుకురావాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

రేపు సిద్దిపేట జిల్లాకు సీఎం

హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కోమటిబండ వద్ద చేపట్టిన సామాజిక వన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రేపు సీఎంతోపాటు మంత్రులు, కలెక్టర్లు పర్యటించనున్నారు. ములుగు నర్సరీతో పాటు అవెన్యూ ప్లాంటేషన్​ను కలెక్టర్లు పరిశీలించనున్నారు.

ఇదీ చూండండి: నామినేటెడ్​ పదవుల భర్తీపై కేసీఆర్​ నజర్​!

ABOUT THE AUTHOR

...view details