తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు మంత్రులతో కేసీఆర్​ భేటీ.. గ్రేటర్ ఎన్నికలపై చర్చ - మంత్రులతో సీఎం కేసీఆర్​ సమావేశం వార్తలు హైదరాబాద్​

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్​ఎంసీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్‌ పీఠమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్​ గురువారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. త్వరలో భేటీ అయ్యే మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

నేడు మంత్రులతో సీఎం కేసీఆర్​ భేటీ.. జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చ
నేడు మంత్రులతో సీఎం కేసీఆర్​ భేటీ.. జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చ

By

Published : Nov 12, 2020, 4:59 AM IST

Updated : Nov 12, 2020, 9:46 AM IST

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ-జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ గురువారం నగరంలో అందుబాటులో ఉండే మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం సమావేశం తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. అటు త్వరలోనే కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేసి జీహెచ్​ఎంసీకి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.

జీహెచ్​ఎంసీ పాలకమండలికి వచ్చే ఫిబ్రవరి వరకు గడువు ఉండగా.. అంతకంటే ముందే ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్‌పై గతంలో కొంత అస్పష్టత ఉండగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్​ఎంసీలోనూ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సర్కారు భావిస్తోంది.

ఇదీ చదవండి:దుబ్బాకలో తెరాస పరాజయానికి కారణాలివే..!

Last Updated : Nov 12, 2020, 9:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details