CM KCR Meeting on IT and ED attacks: సీఎం కేసీఆర్ మంగళవారం రోజున అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఆదాయపన్ను శాఖల వరుస దాడులపై చర్చించారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన విద్యాసంస్థల్లో సోదాలపై ఈ సందర్భంగా ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో సీఎం ఫోన్‌లో మాట్లాడి, ధైర్యం చెప్పారని తెలిసింది.
CM KCR: ఐటీ, ఈడీ దాడులపై ఏం చేద్దాం..మంత్రులతో కేసీఆర్ చర్చ
CM KCR Meeting on IT and ED attacks: ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, నేతలతో మంగళవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఐటీ, ఈడీ దాడులపై చర్చించారు. ఈ మేరకు మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో సోదాలపై ఆరా తీశారు. మంత్రి మల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్.. ఆయనకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
CM KCR Meeting
కేంద్రం వైఖరిపై సీఎం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల దాడుల సమాచారాన్ని సేకరించి, వాటి పూర్వాపరాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: