వర్షాకాల సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, విప్‌లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, శాసనసభ, మండలి చీఫ్ విప్‌లు, విప్‌లు పాల్గొన్నారు. ఈ నెల 7 నుంచి ఉభయసభలు సమావేశం కానున్న తరుణంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.
వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేసీఆర్ దిశానిర్దేశం - సీఎం కేసీఆర్ సమీక్ష తాజా వార్తలు
ఈనెల 7 నుంచి శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహం, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహణపై సమీక్షిస్తున్నారు.
వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేసీఆర్ దిశానిర్దేశం
సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పాలకపక్షం తరఫున లేవనెత్తి ప్రస్తావించాల్సిన అంశాలు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, విధానపర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి సమావేశాలు నిర్వహించాల్సిన విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారు.
ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన