మల్లన్న సాగర్ జలాశయం పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. భూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాలా వరకు పరిహారం ప్రక్రియ పూర్తైందని మిగిలిన వారికి యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి దగ్గరుండి పనులను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే గుండెకాయ - JOSHI
మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్వాసితులకు ఉపాధి, పునరావాసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే ప్యాకేజీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరంకు మల్లన్నసాగరే గుండెకాయ అని అన్నారు.
మల్లన్నసాగర్ పనుల పురోగతిపై సీఎం సమీక్ష
పరిహారం పంపిణీ కోసం గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 11లోపు హైకోర్టుకు నివేదిక పంపాలని ఆదేశించారు. దాదాపు రూ.800 కోట్లతో మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తున్నారు. పరిహారం చెల్లింపు విషయంలో రెండురోజుల క్రితం హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఇవాళ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇవీ చదవండి: స్థానిక సంస్థలు 'చే' జారకుండా కాంగ్రెస్ కసరత్తు
Last Updated : May 3, 2019, 7:48 PM IST