ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక, కష్ట జీవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవులు చెమట చుక్కలు రాలిస్తేనే అభివృద్ధి సాధ్యమైందని… కష్టం చేసే చేతుల వల్లే మానవజాతి పురోగతి సాధిస్తోందని కొనియాడారు. రైతులు, కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తి కులాలుగా కష్టజీవులు తమ శ్రమను ధారపోస్తూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారని అన్నారు. ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం స్పష్టం చేశారు.
శ్రమ జీవుల చెమట చుక్కలతోనే అభివృద్ధి సాధ్యం: సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు
మేడే సందర్భంగా శ్రమ జీవులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టజీవుల చెమట చుక్కలతోనే అభివృద్ధి సాధ్యమని కొనియాడారు. రాష్ట్రంలో ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలు అమలవుతున్నాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ మేడే శుభాకాంక్షలు, కార్మికుల గురించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నివర్గాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో సామాజిక భద్రతా చట్టం పటిష్ఠంగా అమలవుతోందని పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన జరుగుతోందన్నారు. వివిధ రంగాల్లో కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులా.. ఆదుకొనే ఆసుపత్రులివే!