తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రాల హక్కుల్ని హరించేలా కేంద్రం ప్రతిపాదనలు: సీఎం కేసీఆర్

CM KCR letter to Prime Minister Modi, cm kcr wrote letter
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

By

Published : Jan 24, 2022, 5:49 PM IST

Updated : Jan 24, 2022, 6:41 PM IST

17:47 January 24

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

CM KCR letter to Prime Minister Modi : రాష్ట్రాలకు ఇష్టంలేకున్నా ఐఏఎస్​లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా కేడర్‌ రూల్స్-1954ను మార్చాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనలపై మరిన్ని రాష్ట్రాలు గళమెత్తుతున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సీఎం లేఖలో తెలిపారు.

తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్‌ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు. మోదీ తరచూ ప్రస్తావించే వల్లభభాయ్‌ పటేల్‌ ప్రవచించిన సహకార సమాఖ్యస్ఫూర్తిని ఆ నిర్ణయం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉండిపోతాయని వివరించారు. కొత్త నిర్ణయం అమలైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఐఏఎస్​లలో భయం ఏర్పడుతుందని లేఖలో అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 24, 2022, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details