తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన కేసీఆర్ దిల్లీ పర్యటన.. హైదరాబాద్​ చేరుకున్న సీఎం ​ - CM KCR reached Hyderabad

CM KCR reached Hyderabad: దిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్​లో ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్ అక్కడి​ నుంచి నేరుగా దిల్లీ వెళ్లారు. ఎనిమిది రోజులు అక్కడే ఉంటూ మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్​ చేరుకున్నారు.

cm kcr
సీఎం కేసీఆర్​

By

Published : Oct 19, 2022, 3:22 PM IST

Updated : Oct 19, 2022, 3:44 PM IST

CM KCR reached Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన పర్యటన ముగిసింది. 8 రోజుల పాటు దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం హైదరాబాద్ ​ చేరుకున్నారు. ములాయంసింగ్​ యాదవ్​ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్​ వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి నేరుగా దిల్లీ వెళ్లారు. భారత్​ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన కేసీఆర్​.. బీఆర్​ఎస్​ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు.

కార్యాలయంలో చేయవలసిన మార్పుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది రోజులు దిల్లీలోనే ఉన్న కేసీఆర్​ జాతీయ రాజకీయాలపై కొందరి ముఖ్య నేతలతో సంభాషించి, చర్చించారు. అనంతరం సీఎం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు.. అక్కడే ఉంటూ చికిత్స తీసుకున్నారు. నిన్న హస్తినలోనే రాష్ట్ర ముఖ్య అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు చేరుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 19, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details