తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోగ్యకర పోటీ కోసమే... ప్రైవేటు ఆలోచన'

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ​. ఆర్టీసీలో ఆరోగ్యకరమైన పోటీ కోసమే ప్రైవేటు బస్సుల ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు, ఆర్టీసీ సంస్థల మధ్య పోటీతో పాటు ప్రజలకు మంచి సౌకర్యాలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

CM KCR LATEST ANNOUNCEMENT ON TSRTC

By

Published : Nov 2, 2019, 9:39 PM IST

ఆర్టీసీలో ఆరోగ్యకర పోటీ ఉండటం కోసమే ప్రైవేటు ఆలోచన అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భాజపా తెచ్చిన కొత్త రవాణా చట్టం ప్రకారమే వెళ్తున్నామని వివరించారు. యూపీలో దాదాపు 25వేల ప్రైవేటు బస్సులు ఉన్నాయని గుర్తుచేశారు. యూనియన్లంటే సంస్థను, కార్మికులను కాపాడాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీకి ఐదేళ్లలో రూ.712 కోట్లు ఇస్తే... తెరాస ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.900 ఇచ్చిందని కేసీఆర్​ పేర్కొన్నారు.

'ఆరోగ్యకర పోటీ కోసమే... ప్రైవేటు ఆలోచన'

ABOUT THE AUTHOR

...view details