ఎట్టి పరిస్థితుల్లోనూ... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. 5100 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కచ్చితంగా ఆర్టీసీ మనుగడలో ఉంటుందన్నారు. ఆర్టీసీలో కొత్తగా బస్సులు కొనే పరిస్థితి లేదన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థ మరింత నష్టాల్లోకి వెళ్లేలా కార్మిక సంఘాలు వ్యవహరించాయని ఆరోపించారు. ఎవరూ ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి ఉండకూడదని సీఎం సూచించారు. కార్మికుల సంక్షేమం దృష్ట్యా... నాలుగేళ్ల వ్యవధిలో 67 శాతం వేతనాలు పెంచినట్లు పేర్కొన్నారు. 4 వేల మందికి పైగా ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించినట్లు కేసీఆర్ గుర్తుచేశారు.
'ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ విలీనం ఉండదు'
5,100 రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ... మంత్రి వర్గ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు . ఆర్టీసీ మనగడలో ఉంటుందని సీఎం తెలిపారు.
CM KCR LATEST ANNOUNCEMENT ON TSRTC STRIKE