దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వం... కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో మరింత భరోసాను నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా వుండాలని వైద్యశాఖకు ఉన్నతాధికారులు సూచించారు. శనివారం సీఎం తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కరీంనగర్లో జరుగుతున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ల నుంచి ఎప్పటికప్పుడు ఆరాతీశారు.
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా - coronavirus news
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా
22:58 March 20
సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా
Last Updated : Mar 21, 2020, 12:40 AM IST