భారత-చైనా సరిహద్దుల్లో మరణించిన కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషికి ప్రగతిభవన్‌లో అందించారు. సంతోషికి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కర్నల్ సంతోష్ భార్యకు డిప్యుటీ కలెక్టర్‌గా ఉత్తర్వులు - cm kcr Job orders to santhoshi
కర్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను సీఎం కేసీఆర్ అందించారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైదరాబాద్ పరిధిలోనే తనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎం అధికారులకు తెలిపారు.
కర్నల్ సంతోష్‌బాబు భార్యకు ఉద్యోగ ఉత్తర్వులు
సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను ముఖ్యమంత్రి కోరారు. సంతోషితోపాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్
Last Updated : Jul 22, 2020, 7:09 PM IST