CM KCR Instructions to Ministers: వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలపై మూడో రోజు కూడా కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోని పరిస్థితులను తెలుసుకున్నారు. ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
KTR Review Meeting on Heavy Rains : గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వానలు తగ్గుముఖం పట్టాయి, ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల కొనసాగించాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన సందర్భంగా ముంపు కాలనీలు, మూసీ పరివాహక ప్రాంతంల్లో ఎటువంటి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Harish Rao Visit In rehabilitation centers : భారీ వర్షాలు, వరదల వల్ల గురైన బాధితులకి వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకి చెప్పారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే వైద్యశాఖలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిగమ్నమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సేవలపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి సమీక్ష చేస్తున్నారు. ఆస్పత్రుల్లో, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న వైద్య పరీక్షలు, మందులు సరఫరా పరిస్థితిని తెలుసుకుని.. మరింత సౌకర్యాలను అందిస్తున్నారు.
CM KCR Instruction to Puvvada Ajaya Kumar: ఎగువన గోదావరి ప్రాంతంలో వరద ప్రవాహంకొనసాగుతుండటంతో భద్రాచలంలో ముంపునకు గురైన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందని సీఎం ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆ ప్రాంతాలను సందర్శించి అక్కడ పరిస్థితిని సీఎంకి తెలియజేశారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి.. ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి వివరించారు.