CM KCR Independence Day Speech 2023 : 77వ స్వాతంత్య్ర వేడుకలు తెలంగాణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలో(CM KCR Hoists National Flag at Golconda)జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. సాంస్కతిక కళారూపాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు.
CM KCR Speech at 77th Independence day Celebrations : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందున్నదని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ఇప్పటి వరకు రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ అందించుకున్నామని గుర్తు చేశారు. త్వరలోనే కొత్త పీఆర్సీ(CM KCR on NEW PRC to Employees) నియమించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామని కేసీఆర్ అన్నారు. అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సింగరేణి(Singareni) కార్మికులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించారు. దసరా, దీపావళి బోనస్‌గా రూ.1000 కోట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. వచ్చే 3, 4 ఏళ్లలో మెట్రో రైల్ విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయించామన్న సీఎం కేసీఆర్.. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కి.మీ. మెట్రో సౌకర్యం(Hyderabad Metro) అందుబాటులోకి రానుందని తెలిపారు.
CM KCR Speech at Golconda Fort : 'తెలంగాణ ప్రగతి చూసి యావత్ దేశం ఆశ్చర్యపడుతోంది'
చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం..:చేనేత కార్మికుల కోసం మరో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేనేత గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ చూసి కొందరు ఆందోళన చెందుతున్నారన్న సీఎం.. సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశాయని వ్యాఖ్యానించారు. సంకుచిత శక్తుల ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఆర్టీసీ బిల్లును ఆమోదించామన్నారు(TSRTC Bill). ఆర్టీసీ బిల్లు ఆమోదంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
'సాగునీటి రంగంలో స్వర్ణయుగం సృష్టించాం. కొందరు అల్పబుద్ధితో రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగిన జవాబు చెబుతారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ని అడ్డుకునేందుకు విపక్ష నేతలు యత్నించారు. ఎన్జీటీలో కేసులు వేసి వికృత మనస్తత్వం బయట పెట్టుకున్నారు. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలే 'పాలమూరు-రంగారెడ్డి'కి పర్యావరణ అనుమతులు వచ్చాయి. సత్వరమే కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది.'-ముఖ్యమంత్రి కేసీఆర్