CM KCR Inaugurated Martyrs Memorial in Hyderabad :రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించిన మరో ప్రతిష్ఠాత్మక కట్టడం అందుబాటులోకి వచ్చింది. వినూత్నంగా, ప్రత్యేకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. స్వపరిపాలన ధ్యేయంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఎదురుగా ప్రత్యేక నిర్మాణం చేసింది. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు అమరులకు నివాళి అర్పించారు.
ఆ తర్వాత స్మారకంలోని ఆడియో విజువల్ రూంలో ప్రదర్శించిన లఘు చిత్రాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తిలకించారు. అమరజ్యోతిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అక్కడ నుంచి సభావేదిక వద్దకు వచ్చిన కేసీఆర్.. విద్యుత్ దీపాలు చేతబట్టుకొని నివాళి అర్పించారు. అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన తర్వాత.... అక్కడి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొన్నారు. అమరుల నివాళి గీతంతో... సభ ప్రారంభం కాగా కొవ్వొత్తుల వెలుగులతో అంతా అమరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఆలపించిన గీతం ఆకట్టుకుంది.
అనంతరం తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన అమరుల కుటుంబాలను ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతాచారి, టెలిఫోన్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్న పోలీసు కిష్టయ్య, ఓయూక్యాంపస్‌లో... ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్‌రెడ్డి, సిరిపురం యాదయ్య, యాదిరెడ్డి కుటుంబసభ్యులకు శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఉగ్వేదానికి లోనైన అమరుల కుటుంబసభ్యులను... కేసీఆర్ ఓదార్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మాట్లాడిన సీఎం కేసీఆర్ అమర వీరుల త్యాగం, తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న విషయాలను గుర్తు చేశారు. తనపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
డప్పు వాయించిన ఎమ్మెల్యే... నృత్యం చేసిన మంత్రులు :అనంతరం... తెలంగాణ ప్రగతిపై 800 డ్రోన్లతో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన.... దశాబ్ది ఉత్సవాలకే తలమానికంగా నిలిచింది. ఈ ప్రదర్శనను సీఎం కేసీఆర్, మంత్రులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు ఈ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లో.... అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని అమరుల స్మారకం వరకు... భారీ ర్యాలీ నిర్వహించారు. ఆరువేల మంది కళాకారులతో నిర్వహించిన ర్యాలీని... మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ‌్ ప్రారంభించగా... బతుకమ్మలు, బోనాలతో ర్యాలీ సాగింది. కళాకారుల ర్యాలీలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డప్పు వాయించగా... శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ నృత్యం చేశారు.
ఇవీ చదవండి :