తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం: సీఎం కేసీఆర్ - KCR Inaugurated Eight Medical Colleges

అందుబాటులోకి మరో 8 వైద్య కళాశాలలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
అందుబాటులోకి మరో 8 వైద్య కళాశాలలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్

By

Published : Nov 15, 2022, 12:52 PM IST

Updated : Nov 15, 2022, 4:21 PM IST

12:15 November 15

అందుబాటులోకి మరో 8 వైద్య కళాశాలలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం: సీఎం కేసీఆర్

KCR Inaugurated Medical Colleges : రాష్ట్ర వైద్యవిద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్​ వర్చువల్​ విధానంలో ఒకేరోజు 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులను ఆరంభించారు. మంచిర్యాల, మహబూబాబాద్, వనపర్తి, నాగర్​కర్నూల్, కొత్తగూడెం, సంగారెడ్డి, రామగుండం, జగిత్యాల వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో 1150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మంచిర్యాలలో వంద సీట్లు, మిగతా ఏడు కళాశాలల్లో 150 చొప్పున సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

KCR Inaugurated Eight Medical Colleges : ఈ సందర్భంగా మారుమూల మహబూబాబాద్, వనపర్తి లాంటి ప్రాంతాల్లో వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ ఊహించలేదన్న సీఎం కేసీఆర్.. నాటి తెలంగాణ ప్రముఖ ఉద్యమకారుడు హరీశ్​రావు వైద్యమంత్రిగా కళాశాలలు వచ్చేందుకు అపురూప కృషి చేశారని ప్రశంసించారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల సంకల్పంగా ఇప్పటికే 16 జిల్లాల్లో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చాయని.. రాబోయే రోజుల్లో మిగిలిన 17 జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్య కళాశాలలతో పాటు 33 జిల్లాల్లోనూ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని.. మిగతా పారా మెడికల్ కోర్సులను కూడా వరంగల్, ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్కటి వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

KCR Inaugurated New Medical Colleges in Telangana : తెలంగాణ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయమన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేరోజు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం దేశ చరిత్రలోనే అరుదైన సందర్భమని వ్యాఖ్యానించారు. ఎలాంటి వైరస్​లు, మహమ్మారి వచ్చినా తక్షణమే లభించే వైద్య కవచంలా వైద్య విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. వేల కోట్ల వ్యయంతో కళాశాలలు నిర్మించి వైద్యవిద్య అందిస్తున్నామని, ఆర్జించే వైద్యవిద్య తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పూర్తి విజయం సాధించాలని కోరారు.

ప్రభుత్వ ప్రయత్నంతో ఎంబీబీఎస్ సీట్లు 850 నుంచి ఏకంగా 2,790కి పెరిగాయని.. పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా భారీగా పెరిగాయని సీఎం చెప్పారు. కొత్త వైద్య కళాశాలల్లో ఎలాంటి లోపాలు ఉండరాదని.. మంత్రి, అధికారులు ఏడాదిలో రెండు, మూడుసార్లు సందర్శించాలని ఆదేశించారు. వైద్యులతో పాటు వైద్య సహాయక సిబ్బంది కూడా తగు మోతాదులో ఉండాలని స్పష్టం చేశారు. మిగిలిన భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులను సీఎం ఆదేశించారు.

కేటీఆర్​ హర్షం..:వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించారు. 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 3 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని.. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేళ్లలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం రాష్ట్ర వైద్య రంగంలో ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావుకు అభినందనలు తెలిపారు. అలాగే 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలతో పాటు.. 33 నర్సింగ్‌ కళాశాలలు కూడా నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

ఇవీ చూడండి..

TRS Executive Meeting Today : కేసీఆర్ అధ్యక్షతన నేడు తెరాస కార్యవర్గ సమావేశం

మరణించిన వ్యక్తిని సర్పంచ్​గా గెలిపించిన గ్రామస్థులు.. మళ్లీ ఆయనకే ఓటేస్తామంటూ..

Last Updated : Nov 15, 2022, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details