CM KCR Republic day celebrations: హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకం ఆవిష్కరించారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా డీజీపీ మహేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సికింద్రాబాద్‌లో సైనికవీరుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు. యుద్ధవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు
CM KCR Republic day celebrations: హైదరాబాద్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు సికింద్రాబాద్‌లో సైనికవీరుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు.
ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆమె.... అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందన్న గవర్నర్... త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రాజ్‌పథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలు
Last Updated : Jan 26, 2022, 11:46 AM IST