CM KCR help To karnataka Farmer ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. మరణించిన ఓ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. వివిధ రాష్ట్రాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఇటీవల వచ్చిన జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్‌కుమార్ హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
తెలంగాణలో అన్నదాతలకు తెరాస ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి ఇతర పథకాలు బాగా ఉపయోగపడుతున్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కీలకమైన వ్యవసాయాన్ని చక్కటి లాభసాటిగా మారుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ పథకాల అమలు గురించి తెలుసుకున్న కర్ణాటక కర్షకులు సైతం తమ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకాలు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని వెల్లడించారు. కర్ణాటకలో కూడా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 10 లక్షల రూపాయల చెక్‌ను పల్లా చేతుల మీదుగా విమల్‌కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు.