తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​​ నిబంధనలు అందరూ తప్పక పాటించాలి: సీఎం కేసీఆర్

జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై చర్చ
జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై చర్చ

By

Published : May 3, 2020, 11:37 PM IST

Updated : May 4, 2020, 12:06 AM IST

23:32 May 03

లాక్​డౌన్​​ నిబంధనలు అందరూ తప్పక పాటించాలి: సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్​లో లాక్​డౌన్​ నిబంధనల అమలు తీరు, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. లాక్​డౌన్​ అమలులో పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. లాక్​డౌన్ నిబంధనల విషయంలో కేంద్రం జారీ చేసిన మార్గ దర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై చర్చ..

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పరిస్థితి, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధనలు తప్పక పాటించాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, జనార్దన్ రెడ్డి, రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.

 ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు 

Last Updated : May 4, 2020, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details