Chairpersons appointed to Corporations : రాష్ట్రంలో మరో ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఆర్థికసంస్థ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీనియర్ నేత గజ్జెల నగేష్... రాష్ట్ర టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ ఛైర్మన్‌గా పాటిమీది జగన్మోహన్ రావుకు బాధ్యతలు అప్పగించారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా రచయిత జూలూరి గౌరీశంకర్... షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను నియమించారు. ఛైర్మన్ల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను రెండు రోజుల క్రితమే నియమించారు. తాజాగా మరో ఐదుగురిని నియమించారు.
Chairpersons appointed to Corporations : పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు

10:19 December 17
తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్
కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీగా గెలిచిన ఆకుల లలిత తదుపరి పరిణామాల్లో తెరాసలో చేరారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా... ఆమెకు మరో అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో లలితను రాష్ట్ర మహిళా ఆర్థికసంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. సీనియర్ నేత గజ్జెల నగేష్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. 2014లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనను బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.
టికెట్ ఆశించి.. కార్పొరేషన్లకు..
కేటీఆర్ అనుచరుడిగా ఉన్న పాటిమీది జగన్మోహన్ రావు తెరాస సోషల్ మీడియా విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఆయనకు టీఎస్టీఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. రచయిత జూలూరి గౌరీశంకర్ బీసీ కమిషన్ సభ్యునిగా పనిచేశారు. ఆయనను సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఇటీవల నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా టికెట్ ఆశించారు. తాజా పరిణామాల్లో బాలరాజు యాదవ్‌ను గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించారు.
ఇదీ చదవండి:Priest Rangarajan on Akhanda: ‘అఖండ’పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడి కామెంట్స్