Latha Mangeshkar: లతామంగేష్కర్ మృతిపట్ల సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సంతాపం ప్రకటించారు. ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. లత భారతీయ సినీ, సంగీత రంగంపై చెరగని ముద్రవేశారని సీఎం కొనియాడారు. లతామంగేష్కర్ కుటుంబీకులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా: గవర్నర్
Governor tamilisai: లత మంగేష్కర్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. లతామంగేష్కర్ మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని గవర్నర్ ప్రకటించారు. ఆమె మరణ వార్త విని చాలా బాధపడ్డానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె మరణం భారతదేశాకే తీరని లోటుగా మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆమె ఆలపించిన పాటలే తరతరాలకు ఆమె గొప్పతనాన్ని చాటుతాయన్న హరీశ్ రావు.... లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం లతా మంగేష్కర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. నటుడు చిరంజీవి నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇక లేరని తెలుసుకుని గుండె పగలినట్టవుతోందంటూ సంతాపం తెలిపారు.
సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర: సీఎం కేసీఆర్
ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటలతో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ చెరగని ముద్ర వేశారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. దేశానికి ఆమె గాంధర్వ గానం అందిందన్న కేసీఆర్.. భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరంగా పేర్కొన్నారు. లత మంగేష్కర్ మరణంతో సంగీత మహల్ ఆగిపోయిందంటూ విచారం వ్యక్తం చేశారు. దేశంలోని 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లత సరస్వతీ స్వర నిధని.. వెండితెర మీద నటుల హావభావాలకు తగినట్టుగా గాత్రాన్ని ఆలపించటం ఆమె ప్రత్యేకతని సీఎం అన్నారు.
సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో అలరించిన లతా మంగేశ్వర్, ఉత్తర దక్షిణాదికి సంగీత వారధిగా నిలిచిందన్నారు. హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్దు కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తన గాత్రంలో ఉర్దు భాషలోని గజల్ గమకాల సొబగులను ఒలికించేవారన్న కేసీఆర్ తెలిపారు. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే.. ఆమెకు దేశ, విదేశాల్లో లెక్క లేనన్ని పురస్కారాలు దక్కాయని స్మరించుకున్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి: బండిసంజయ్