ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేపు దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతిభవన్‌లో రేపు రాత్రి ఎనిమిది గంటలకు జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
ట్రంప్ కుటుంబానికి కేసీఆర్ కానుకలు - kcr news
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బహుమతులు ఇవ్వనున్నారు. రేపు రాష్ట్రపతిభవన్‌లో జరిగే విందు సందర్భంగా కానుకలను అందజేయనున్నారు.
ట్రంప్ కుటుంబానికి కేసీఆర్ కానుకలు
విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫిలిగ్రి చార్మినార్ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను సీఎం కేసీఆర్ అందజేయనున్నారని తెలిసింది. ట్రంప్ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకాలకు పోచంపల్లి, గద్వాల పట్టుచీరలను బహూకరించనున్నట్లు సమాచారం. సీఎం 26న దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
ఇదీ చూడండి:ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్