వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు - సీఎం కేసీఆర్ వార్తలు
10:16 April 24
వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని స్పష్టం చేశారు.
దేశంలో కొన్ని అగ్నిప్రమాదాల ఘటనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
గాంధీ, టిమ్స్ వంటి చోట్ల అగ్నిమాపకయంత్రాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ను యుద్ధ విమానాల ద్వారా తీసుకువస్తున్నామన్నారు. అవసరమున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ చేరాలని చెప్పారు.