ఎమ్మెల్యేకి కేసీఆర్ పరామర్శ.. రంగాపూర్‌లో రైతులతో ముచ్చట CM KCR Gadwal Tour: ముఖ్యమంత్రి కేసీఆర్... జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. తండ్రి బండ్ల వెంకటరామిరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఎమ్మెల్యేను పరామర్శించడానికి రోడ్డు మార్గాన గద్వాలకు చేరుకున్న కేసీఆర్... ఎమ్మెల్యే తండ్రి వెంకటరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అబ్రహం, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు తదితర నాయకులు పాల్గొన్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
రంగాపూర్ రైతులతో మాటామంతీ...
అనంతరం రోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. మార్గమధ్యలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న మినప.. వేరుశనగ పంట పొలాలను పరిశీలించిన సీఎం... అనంతరం రైతులతో మాట్లాడారు. యాసంగిలో ఎక్కువగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అందుకు సంబంధించిన విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు చూసుకుంటారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరిసాగు చేసి రైతులు ఇబ్బందులకు గురి కావద్దని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలపై దృష్టి సారించిందన్నారు. ఈ విషయంలో రైతులు సహకరించాలని సీఎం కోరారు.
బీజేవైఎం నిరసన...
అంతకుముందు గద్వాలకు వెళ్తుండగా... సీఎం కాన్వాయ్ అడ్డగింతకు బీజేవైఎం కార్యకర్తల యత్నించారు. సీఎం కేసీఆర్ గద్వాలకు వెళ్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. జడ్చర్ల వద్ద సీఎం కాన్వాయ్ పైకి బీజేవైఎం కార్యకర్తలు దూసుకెళ్లారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీజేవైఎం కార్యకర్తల నినాదాలు చేశారు. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుని పీఎస్‌కు తరలించారు.
ఇదీ చదవండి:చెరువులో దూకి తల్లీ కుమార్తె ఆత్మహత్య.. కుటుంబకలహాలే కారణమా?