CM kcr speech on shinde: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం... కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా మంచి పని జరిగిందా అని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా రాజ్యాంగ సంస్థలను దుర్వియోగంచేస్తూ... దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ సంస్థలను కూలదోస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికీ పది రాష్ట్రాలను కూల్చారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు లేరు... కూలగొడతాం మిమ్మల్ని.. అని అంటున్నారని తెలిపారు. ఎలా కూలగొడుతవ్? అని ప్రశ్నించారు.
నిన్నగాక మొన్న తమిళనాడులో స్టాలిన్ గెలిచారన్న సీఎం కేసీఆర్... అక్కడ భాజపా అధ్యక్షుడు తమిళనాడులో ఏక్‌నాథ్ షిండే వస్తడని మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. షిండేలు ఎవరి కోసం.. ఎవరిని బెదిరిస్తరు? అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎవరి గొంతు నొక్కుదామనుకుంటున్నారని ప్రశ్నించారు. అందరు ఒకటై తమరి గొంతు పడితే ఎక్కడికి పోతారని అన్నారు.