సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకోబోమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకోగా... తాజాగా కేసీఆర్ అదే బాటలో నడిచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీలో ప్రస్తుతం కేవలం 1,200 మంది కన్నా తక్కువగానే ఉద్యోగులు ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. వాస్తవంగా ఆర్టీసీలో 49,860 మంది పనిచేస్తున్నారు. అంటే సమ్మెలో ఉన్న మిగిలిన 48,660 మంది కార్మికులను తొలగించినట్లేనని చెప్పకనే చెప్పారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఇది సంచలనానికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2003 ప్రాతంలో తమిళనాడులో సమ్మెకు దిగిన 1.7 లక్షల మంది ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అప్పటి సీఎం జయలలిత ప్రకటించారు. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేశారు.
పురుచ్చి తలైవి బాటలో... సీఎం కేసీఆర్...! - ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు...
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోపు విధుల్లోకి రాని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇలాంటి ఆసక్తికర ఘటనే... గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా తీసుకున్నట్లు ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. అమ్మ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నాడంటూ... చర్చించుకుంటున్నారు.
CM KCR FLOWING TAMILANADU EX CM JAYALAITHA IN TELANGANA RTC STRIKE ISSUE
ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
Last Updated : Oct 7, 2019, 8:53 AM IST