ఎన్ని అడ్డంకులెదురైనా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ సమక్షంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కార్యక్రమం మొదలవుతుందన్న ఆయన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఐదు పంపింగ్ స్టేషన్లను మంత్రులు ప్రారంభిస్తారని వివరించారు. 20 బ్యాంకుల కన్సార్టియం సహకారం వల్లే అనుకున్న సమయానికి ప్రాజెక్టును నిర్మించగలిగామని... వారిని కూడా కార్యక్రమానికి ఆహ్వానించామని చెప్పారు. ప్రారంభోత్సవానికి మొత్తం ఐదు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజలకు ప్రారంభోత్సవ రోజు గుర్తుండిపోతుందని అన్నారు.
'కాళేశ్వరం ప్రారంభోత్సవానికి 5 హెలిక్యాప్టర్లు' - కేబినెట్ బేటీ
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మొత్తం ఐదు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన 20 బ్యాంకుల కన్సార్టియంలను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవంతో పాటు హోమం, పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం కేసీఆర్