బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు - telangana budget details
16:26 March 15
బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు
బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుదికసరత్తు చేస్తున్నారు. ఈ నెల 18న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశయ్యారు.
బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని పరిశీలించనున్న సీఎం కేసీఆర్... కేటాయింపులు, ప్రాధాన్యాలకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. వాటి ఆధారంగా బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అధికారులకు దిశానిర్ధేశం చేస్తారు.
ఈనెల 26 వరకు పదిరోజుల పాటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా... ఈనెల 18న శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను సర్కారు ప్రవేశపెట్టనుంది. 23, 22, 23 తేదీల్లో బడ్జెట్‌పై సభలో చర్చించనున్నారు. 26న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి... సభ ఆమోదం తెలపనుంది.