తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్​లో తొలి శంఖారావం - కేసీఆర్ ప్రచారరథం

CM KCR Election Campaign Vehicle : బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి ప్రచారరథం సిద్ధమైంది. ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ బస్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల్లో.. ఈ ప్రచారరథం భాగం కానుంది.

BRS Election Campaign Vehicle
CM KCR Election Campaign Vehicle

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 3:56 PM IST

CM KCR Election Campaign Vehicle: తెలంగాణలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నవంబరు 30న (TS Elections) ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. గతంలో కంటే ఈసారి నేతలు కొత్త ట్రెండ్​లు ఫాలో అవుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు నూతన మార్గాలు వెతుకుతూనే ఉన్నారు. రాష్ట్ర అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ప్రచారరథం సిద్ధమైంది. ప్రచారానికి స్పెషల్ బస్సును ఏర్పాటు చేసుకున్నారు. దానిపై కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుబాళింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Telangana Election Campaign Vehicles : ఎన్నికల వేళ.. రెడీ అవుతున్న 'ప్రచార రథాలు'.. లక్షలు వెచ్చిస్తున్న నేతలు

CM KCR Campaign Bus For Elections : ఇవాళ్టి నుంచి మొదలయ్యే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇది రోడ్లపై పరుగులు పెట్టనుంది. మధ్యాహ్నం తెలంగాణ భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో (BRS Manifesto) విడుదల చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్లనున్నారు. అక్కడ 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొని.. ఎన్నికల ప్రచారభేరి మోగిస్తారు. సోమవారం నుంచి వరుసగా బీఆర్ఎస్ ప్రచార సభలు కొనసాగుతాయి. ఈ ప్రచార సభల్లో ప్రచారరథం సైతం భాగం అవ్వనుంది. ఈ ప్రచార రథాన్ని (BRS Election Vehicle) ఎన్నికల కోసం ఏర్పాటు చేయడం.. దీన్నుంచే సీఎం కేసీఆర్ బహిరంగ సభలకు హాజరుకానున్నారు.

BRS MLA Ticket Issue in Gadwal : బీఆర్​ఎస్​లో అసమ్మతుల సెగ.. అలంపూర్‌ టికెట్‌ ఎవరికి ?

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అధికార పార్టీ అన్నింటికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి ప్రచార వ్యూహరచన, మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమైన కేసీఆర్... హస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ప్రచారాల్లో అభ్యర్థులు తమ పథకాలను.. తెలంగాణలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

BRS Party Started its Campaign : బీఆర్ఎస్ పార్టీ 45 రోజుల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తే.. ఇవాళే కాంగ్రెస్ మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ 45 రోజుల్లో వీలైనన్ని బహిరంగ సభలు నిర్వహించి.. మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేలా గులాబీ పార్టీ ప్లాన్ చేస్తుంది. మరోవైపు అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఎన్నికలన్నప్పుడు అసంతృప్తి తప్పదని.. టికెట్ వచ్చిన నేతలు.. మిగతా వారిని కలుపుకుపోవాలని ఇప్పటికే వారికి దిశానిర్దేసం చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు.. ఇతర పార్టీల్లో చేరితే.. అది గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే అభ్యర్థులందరూ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలందరిని కలవాలని.. వారితో చర్చలు జరిపాలని గులాబీ బాస్ సూచించారు.

ఎన్నికల వేళ 'ప్రచార రథాల' వైపు నేతల చూపు!

Harish Rao on Medak District Development : 'మెదక్​లో ఆత్మగౌరవానికి.. నోట్ల కట్టలకు మధ్య పోటీ'

ABOUT THE AUTHOR

...view details