తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Election Campaign Schedule 2023 : 110 నియోజకవర్గాలు.. 17 రోజులు.. 41 సభలు.. ఉద్ధృత ప్రచారానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు

CM KCR Election Campaign Schedule 2023 Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 110 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. రోజుకు రెండు, మూడు సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి నవంబరు 9 వరకు 41 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార షెడ్యూలును బీఆర్​ఎస్​ ప్రకటించింది. సభలకు భారీగా జన సమీకరణ జరిగేలా బీఆర్​ఎస్​ కసరత్తు చేస్తోంది. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ.. మరోవైపు హామీలు ఇస్తూ.. ఇంకో వైపు కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడుతూ గులాబీ దళపతి ప్రచారం జరగనుంది.

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 6:55 AM IST

CM KCR Election Campaign
CM KCR Election Campaign Schedule in Telangana

CM KCR Election Campaign Schedule in Telangana బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఎన్నికల ప్రచార షెడ్యూల్​ విడుదల.. సుడిగాలి పర్యటనలే

CM KCR Election Campaign Schedule 2023 Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(Telangana Campaign 2023) చేయనున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో మినహా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో(BRS Public Meeting) కేసీఆర్ పాల్గొననున్నారు. హెలికాప్టర్ ద్వారా రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ మొదటి విడత ఎన్నికల ప్రచార షెడ్యూలు(KCR Election Tour Schedule)ను బీఆర్​ఎస్​ వెల్లడించింది. ఈ నెల 15న కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. ఆ రోజున తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్థులతో కేసీఆర్‌ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడంతో పాటు.. మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్​లో కేసీఆర్ ప్రచారం మొదలు కానుంది.

ఈ నెల 16న జనగామ, భువనగిరి, 17వ తేదీన సిరిసిల్ల, సిద్ధిపేట,18న జడ్చర్ల, మేడ్చల్​లో కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. బతుకమ్మ సంబురాలు, దసరా పండుగ ఉన్నందున ఈ నెల 25 వరకు కేసీఆర్ సభలకు విరామం ఇచ్చారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూలు, మునుగోడు, 27వ తేదీన పాలేరు, స్టేషన్ ఘన్​పూర్​లో బహిరంగ సభలు ఉంటాయని బీఆర్​ఎస్​ తెలిపింది. ఈ నెల 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, 30న జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, 31వ తేదీన హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు.

KCR Campaign Schedule 2023 : నవంబరు 1న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, 3వ తేదీన భైంసా, ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం సభల్లో సీఎం పాల్గొంటారు. నవంబరు 6న గద్వాల, మక్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8వ తేదీన సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో గులాబీ దళపతి సభల్లో ప్రసంగిస్తారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేస్తారు. తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటిగంటకు గజ్వేల్​లో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేసి.. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

MLC Kavitha Campaign in Nizamabad : "బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాదు.. బీసీ ప్రభుత్వం"

Telangana Assembly Elections 2023 : ప్రతీ సభలోనూ సుమారు గంట పాటు కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రసంగాలపై బీఆర్​ఎస్​ అధినేత ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రగతి, సంక్షేమాన్ని వివరించి.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయనున్న పథకాలపై హామీ ఇవ్వనున్నారు. జాతీయ, రాష్ట్ర అంశాలతో పాటు.. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రసంగాల్లో ప్రస్తావించనున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలతో గులాబీ దళపతి విరుచుపడేలా బహుముఖ వ్యూహంతో ప్రసంగాలు కొనసాగనున్నాయి.

కేసీఆర్ సభలకు జన సమీకరణపై బీఆర్​ఎస్​ ప్రత్యేక దృష్టి సారించింది. భారీగా జన సమీకరణ చేసేలా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. హుస్నాబాద్ నేతలతో హరీశ్​రావు, జనగామ నాయకులతో కేటీఆర్ ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. నవంబరు 9 నుంచి 28 వరకు మలి విడత ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ సభలకు సమాంతరంగా కేటీఆర్, హరీశ్​రావు.. రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు.

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల బరిలోకి సీఎం కేసీఆర్​.. రోజుకు 3 బహిరంగ సభలు.. 100 నియోజకవర్గాలు టార్గెట్

BRS Election Campaign Telangana 2023 : సుడిగాలి పర్యటనలు.. వాడివేడి ప్రసంగాలతో.. ప్రచారంలో బీఆర్ఎస్ జోష్

ABOUT THE AUTHOR

...view details