హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన తాజా వార్తలు
11:40 December 13
హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. శనివారం ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. అంతకు ముందు రోజు కేంద్ర హోంశాఖ, జల్‌శక్తి శాఖ మంత్రులను కలిశారు.
రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో 6 దేశీయ విమానాశ్రయాల ఏర్పాటుపై మాట్లాడారు. విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిధులు మంజూరు చేసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:10 మందిని బలితీసుకున్న రహదారులు