ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి కలెక్టరేట్ ప్రాంగణంలో జంట హెలిపాడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జులై చివరి నాటికి ప్రభుత్వ భూములు, ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల భూములు, ఆస్తుల వివరాల నమోదు కోసం ఎస్టేట్ అధికారితో పాటు పర్యవేక్షణ కోసం జిల్లాకొక ఎస్టేట్ అధికారిని నియమించాలన్నారు.
CM KCR: 'ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్ ఏర్పాటు చేయాలి' - Cm kcr on collectorates
18:36 June 26
ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్ ఏర్పాటు చేయాలి
ఎస్టేట్ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పని చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎస్టేట్ అధికారిని నియమించి... సీఎస్ పర్యవేక్షణలో విధులుంటాయని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి పనుల కోసం వివిధ స్థాయుల్లో నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రుల వద్ద రూ.2 కోట్లు, కలెక్టర్‌కు రూ.కోటి కేటాయింపు చేపట్టినట్లు సీఎం వివరించారు.
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులూ వాడుకోవచ్చని తెలిపారు. స్థానిక జిల్లా మంత్రి నుంచి ఆమోదం తీసుకొని ఖర్చు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం