తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం గత నెల 20 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది ఇవాళ ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో ఉంది. బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు.
రాత్రి కర్ఫ్యూ పొడిగింపుపై నేడు కేసీఆర్ నిర్ణయం
రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నెల 20 నుంచి అమల్లోకి వచ్చిన రాత్రి కర్ఫ్యూ... నేటితో ముగియనుంది. కరోనా కేసుల దృష్ట్యా మరికొన్ని రోజులు కర్ఫ్యూ పొడిగించే అవకాశం కన్పిస్తోంది. దీనిపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటించనున్నారు.
రాత్రి కర్ఫ్యూపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం
వీటిన్నంటినీ పరిశీలించిన సీఎం కేసీఆర్ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితిపై బంధువులకు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో లాక్‌డౌన్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతుండగా అదేమీలేదని హోంమంత్రి మహమూద్ అలీ, వైద్యమంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కిట్లకు, టీకాలకు కటకట.. పలుచోట్ల తగ్గిన నిర్ధారణ పరీక్షలు!