తెలంగాణ

telangana

ETV Bharat / state

నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ: సీఎం కేసీఆర్‌ - ప్రపంచ మహిళా చాంపియన్​షిప్​లో నిఖత్​ స్వర్ణం

Nikhat Zareen Won Gold Medal In World Women Championship: ప్రపంచ మహిళా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో హైదరాబాదీ క్రీడాకారిణి నిఖత్ జరీన్​ రెండోసారి స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఆమె స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్ర సీఎం కేసీఆర్​ ప్రశంసలు కురిపించారు. ఈ బంగారు పతకాన్ని మళ్లీ గెలవడం వల్ల దేశఖ్యాతిని మరోసారి చాటి చెప్పావని ఆయన కొనియాడారు.

nikhat zareen
nikhat zareen

By

Published : Mar 26, 2023, 11:03 PM IST

Updated : Mar 26, 2023, 11:08 PM IST

Nikhat Zareen Won Gold Medal In World Women Championship: ప్రపంచ​ మహిళా బాక్సింగ్​ చాంఫియన్​షిప్​లో అమ్మాయిలు అదుర్స్​ అనిపించారు. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. బాక్సింగ్​ విభాగంలో ఇలా నాలుగు స్వర్ణాలు గెలుపొందడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ చాంపియన్​గా నిలిచి.. హైదరాబాదీ అమ్మాయి నిఖిత్​ జరీన్​ దిగ్గజ బాక్సర్​ మేరికోమ్​ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. గతంలో 52 కేజీల విభాగంలో పోటీ పడిన బంగారు పతకం గెల్చుకున్న జరీన్​.. ఈసారి 50 కేజీల ఫ్లై వెయిట్​ విభాగంలో పోటీ పడి మరోసారి తానే ఛాంపియన్​​ అని నిరూపించుకుంది.

బాక్సింగ్​ రింగ్​లో పంచ్​లు విసురుతున్న జరీన్​

నిఖత్​ జరీన్​కు సీఎం అభినందనలు: న్యూదిల్లీలోని కే.డీ.జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్ ఫైనల్​ పోటీల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని సాధించిన నిఖత్ జరీన్​ను సీఎం కేసీఆర్ అభినందించారు. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఫిప్​లో భారత్​కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన.. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని అన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో తన కెరీర్​లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. క్రీడాభివృద్దికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మంత్రి హరీశ్​రావు సైతం నిఖత్​ జరీన్​కు అభినందనలు తెలిపారు. నిన్ను చూసి దేశం గర్విస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ప్రపంచ ఛాంపియన్​ షిప్​లో నిఖత్​ జరీన్​ స్వర్ణ పతకం గెలుపొందడంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్​ వేదిక ద్వారా అభినందనలు తెలిపారు. అనంతరం రెండోసారి ఛాంపియన్​షిప్​ సాధించడం పట్ల సంతోషంగా ఉందని నిఖత్ జరీన్ హర్షం వ్యక్తం చేసింది. తన వెన్నంటే నడిచిన గురువు భాస్కర్​, కోచ్​, సపోర్టింగ్​ స్టాఫ్​కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ విజయంపై నిఖత్ జరీన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 26, 2023, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details