తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇస్రో ప్రయోగం విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాకెట్​ను విజయవంతంగా ప్రయోగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని సీఎం వ్యాఖ్యానించారు. పది ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలో ప్రవేశపెట్టినందుకు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

cm-kcr-congratulates-isro-scientists-to-complete-suuccesfuloc-pslv-49
ఇస్రో ప్రయోగం విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

By

Published : Nov 7, 2020, 7:20 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన పీఎస్​ఎల్​వీ సి-49 విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి భారత్​కు చెందిన ఈవోఎస్​-01 శాటిలైట్​ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఈవోఎస్​తో పాటు మరో తొమ్మిది ఉపగ్రహాలను ఓకేసారి ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను, సాంకేతిక సిబ్బందిని కేసీఆర్​ అభినందించారు.

ఇదీ చూడండి:శంషాబాద్​ విమానాశ్రయం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు

ABOUT THE AUTHOR

...view details