తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Congratulates ISRO on Aditya-L1 Success : అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది: సీఎం కేసీఆర్ - ఆదిత్య ఎల్‌1 ప్రయోగం

CM KCR Congratulates ISRO on Aditya-L1 Success : ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను.. సిబ్బందిని అభినందించారు. అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని హర్షించారు.

CM KCR Congratulates to ISRO
CM KCR Congratulates to ISRO on Aditya-L1 Success

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 4:09 PM IST

CM KCR Congratulates ISRO on Aditya-L1 Success : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. ఆదిత్య-ఎల్‌1(Aditya-L1) విజయవంతంగా ప్రయోగించడం పట్ల సీఎం కేసీఆర్‌(CM KCR) హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో(ISRO) అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని సీఎం పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

బిర్లా ప్లాంటోరియం సైన్స్‌ సెంటర్‌లో ప్రయోగాన్ని వీక్షించిన విద్యార్థులు..: ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాన్ని హైదరాబాద్‌లోని బిర్లా ప్లాంటోరియం సైన్స్ సెంటర్ నుంచి విద్యార్థులు వీక్షించారు. రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్న సమయంలో చిన్నారులు ఎనలేని ఉత్సాహాన్ని చూపిస్తూ చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సంబంధించిన శాస్త్రీయ, సాంకేతిక వివరాలు, ప్రయోగం వల్ల కలిగే ప్రయోజనాలను ఓయూ ఆస్ట్రానమీ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రుక్మిణీ, బిర్లా ప్లాంటోరియం సైన్స్ సెంటర్ డైరెక్టర్ కేజీ కుమార్ విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. సుమారు గంటన్నర పాటు విద్యార్థులు ప్రయోగ విశేషాలను తెలుసుకొని ఆనందించారు. అంతేకాకుండా సౌర వ్యవస్థకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు.

Aditya L1 Mission : 'అంతరిక్ష రంగంలో భారత్‌ పాత్ర పెరుగుతోంది'.. 'ఆదిత్య' విజయం కోసం హోమాలు, పూజలు

ISRO Aditya-L1 Launch Successfully : భారత అంతరిక్ష రంగం మరో మైలురాయిని అందుకుంది. ఇప్పటికే చంద్రుని దక్షిణ ధృవంపై ప్రయోగానికి చంద్రయాన్‌-3(Chandrayan-3) ఉపగ్రహాన్ని పంపి విజయం సాధించిన ఇస్రో.. తాజాగా సూర్యుడి దిశగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించి విజయం సాధించింది. ఇందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ57(PSLV-C57) వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో గల సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) వేదికగా ప్రయోగం చేశారు. ఈ ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం గమనాన్ని ఇక్కడి నుంచే శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు.

సూర్యుడి దగ్గరకు ఆదిత్య-ఎల్‌1 ప్రయాణం : ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం 125 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి.. ఎల్‌1(Lagrange) పాయింట్‌కు చేరుకుంటుంది. ఇలా ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహం ప్రయోగించడం ఇదే మొదటిసారి. మొదట పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని.. భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత దాన్ని ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను ఉపయోగించి దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపనున్నారు. అనంతరం ఎల్‌1 బిందువు వైపు నడిపించనున్నారు. అక్కడ భూ గురుత్వాకర్షణ ప్రభావిత ప్రాంతాన్ని దాటి వెళ్లిపోతుంది. అప్పుడు క్రూజ్‌ దశ ప్రారంభమయ్యి.. 125 రోజుల తర్వాత ఎల్‌1 బిందువును చేరుకుంటుంది.

Midhani Director Interview : చంద్రయాన్‌-3 సక్సెస్‌లో హైదరాబాద్ మిథాని కీలక పాత్ర

Aditya-L1 Satellite Sent by ISRO to Sun : ఎలాంటి అవరోధం లేకుండా సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌, కరోనా పొరలను అధ్యాయనం చేయనుంది. దీని వల్ల అక్కడ వచ్చే సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవచ్చు అనే భావనలో శాస్త్రవేత్తలు ఉన్నారు. అలాగే సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి కూడా అధ్యాయనం చేయనున్నారు. అలా భూమిపై ఉన్న ఉపగ్రహాలకు సూర్యుడిని ఫొటోలను రోజుకు 1,440 పంపి.. నిమిషానికోసారి క్లిక్‌ మనిపించి పంపనుంది.

Aditya L1 Launch : నింగిలోకి 'ఆదిత్య ఎల్​ 1'.. ప్రయోగం సక్సెస్.. వీడియో చూశారా?

Aditya L1 Launch : నింగిలోకి దూసుకెళ్లిన 'ఆదిత్య ఎల్​1'.. సూర్యుడిని నిమిషానికోసారి క్లిక్‌!

ABOUT THE AUTHOR

...view details