రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల వినియోగం 3 రెట్లు పెరిగిందని సీఎం అన్నారు. కరోనా కాలంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని అన్నారు. ధాన్యం నిలువ చేసే భారీ, శాస్త్రీయ గోదాములు రాష్ట్రంలో ఉండవని పేర్కొన్నారు.
Cm Kcr on Farmers: 'రైతులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మాది' - Cm kcr on paddy
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏడేళ్ల కాలం నుంచి అన్నదాతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
'యాసంగిలో వరి వద్దని వ్యవసాయశాఖ మంత్రి చెప్పారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారు. సాగును స్థిరీకరించి గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేయాలని భావించాం. అడుగంటిన భూగర్భ జలాలు పెంచాలని భావించాం. అనేక పెట్టుబడులు పెట్టి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ప్రపంచంలోనే ఎక్కడాలేని రైతుబంధు తీసుకువచ్చాం. రైతుబీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతంలో రైతులకు విత్తనాలు, ఎరువులు కూడా సరిగా దొరికేవి కావు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కల్తీ విత్తనాలమ్మేవారిపై పీడీ యాక్టు తెచ్చిన సర్కారు మాది.-- కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: