CM KCR condoled the death of Chalapati Rao: నటుడు చలపతిరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. మూడు తరాల నటులతో కలిసి నటించిన గొప్ప వ్యక్తి చలపతిరావు అని సీఎం కొనియాడారు. వెండితెరపై తన నటనతో చలపతిరావు తనదైన ముద్ర వేశారన్నారు. చలపతిరావు మరణం సినీ రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీనియర్ నటుడు చలపతిరావు మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.. - చలపతిరావు పార్థీవదేహానికి తలసాని నివాళులు
CM KCR condoled the death of Chalapati Rao: సీనియర్ నటుడు చలపతిరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వెండితెరపై తన నటనతో చలపతిరావు తనదైన ముద్ర వేశారని సీఎం కొనియాడారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం చలపతిరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. తనతో ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుచేసుకున్నారు.
సీఎం కేసీఆర్
మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. చలపతిరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. సీనియర్ నటుడు చలపతిరావు మరణం చాలా బాధాకరమని మంత్రి అన్నారు. చలపతిరావుతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. ఎన్టీఆర్తో చలపతిరావుకు మంచి అనుబంధం ఉండేదని కొనియాడారు.
ఇవీ చదవండి: