తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2023, 4:54 PM IST

Updated : Jun 11, 2023, 5:09 PM IST

ETV Bharat / state

Mulugu ZP Chairman Passes Away : గుండెపోటుతో ములుగు జడ్పీ ఛైర్మన్​ మృతి.. సీఎం కేసీఆర్ సంతాపం

Mulugu ZP Chairman Kusuma Jagadish Passes Away : ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మృతి చెందారు. గుండెపోటుతో హనుమకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జగదీశ్​ అకాల మరణం పట్ల సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో ఆయన చురుకైన పాత్రను పోషించారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Mulugu ZP Chairman Passes Away
Mulugu ZP Chairman Passes Away

CM KCR Expresses Grief over Mulugu ZP Chairman Death : ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మృతి చెందారు. గుండెపోటుతో హనుమకొండలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జగదీశ్​ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో ఆయన చురుకైన పాత్రను పోషించారని గుర్తు చేసుకున్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ములుగు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కుసుమ జగదీశ్‌

KTR Expresses Grief over Mulugu ZP Chairman Death..: రెండు దశాబ్దాలకు పైగా సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా జగదీశ్‌ సేవలు అందించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జగదీశ్‌ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్‌.. జగదీశ్​ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అత్యంత సన్నిహితుడిని కోల్పోయాను..: జగదీశ్‌ అకాల మరణం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన జగదీశ్‌ మృతి.. ఎంతో బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల మంత్రి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

BRS Leaders Condolence on Kusuma Jagadish Death : తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీశ్‌ చురుకైన పాత్ర పోషించారని.. ఆయన మరణ వార్త బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీశ్‌ మరణం.. తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగదీశ్​ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగదీశ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

Kusuma Jagadish Death In Mulugu : జగదీశ్‌ పార్టీకి, ములుగు జిల్లాకు చేసిన సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జగదీశ్‌ మృతి పట్ల శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ప్రభుత్వ విప్‌, భద్రాద్రి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రేగా కాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 11, 2023, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details