తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR ON JAYASANKAR: ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నాం: కేసీఆర్‌ - ఆచార్య జయశంకర్ జయంతి

తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆచార్య జయశంకర్ సదా నిలిచే ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆయన జీవితం అర్పించారని కొనియాడారు. ప్రజల గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారన్నారు. ఆయన ఆశయాలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని, ఆయన కలగన్న తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు.

CM KCR ON  JAYASANKAR
ఆచార్య జయశంకర్ సదా నిలిచే ఉంటారన్న సీఎం కేసీఆర్

By

Published : Aug 6, 2021, 1:59 AM IST

తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచివుంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సాధనకోసం చేసిన త్యాగాలను, ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని వర్గాల సమగ్రాభివృద్ది కోసమే స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను.. తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని సీఎం వెల్లడించారు.

ఏడేళ్లలోనే అన్నిరంగాలు తీర్చిదిద్దుతున్నాం

రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల అనతికాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయరంగం, వంటి పలు మౌలిక భౌతిక రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం, సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సీఎం పేర్కొన్నారు. మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలఎత్తుకుని తిరిగే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సమ సమాజ స్థాపన దిశగా, బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

సీసీఐ ప్లాంట్​ను పునరుద్ధరించాలని కేంద్రానికి కేటీఆర్​ లేఖ

GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

ABOUT THE AUTHOR

...view details