CM KCR Latest News : సోలాపుర్, నాగ్‌పుర్ తదితర ప్రాంతాల నేతలు, ప్రముఖులు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని సోలాపుర్ సహా మహారాష్ట్రలో చేసి చూపించే బాధ్యత తనదని పేర్కొన్నారు. మరాఠా రాజకీయ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించిన కేసీఆర్... ‘అభివృద్ధి నిరోధకులకు ఓట్లేస్తూ, ఇంకెన్నాళ్లు వెనకబాటుతనంలో ఉందమని ప్రశ్నించారు.
CM KCR Latest News Today : అభివృద్ధి.. బీఆర్ఎస్ రూపంలో ప్రతి ఇంటి గడపముందుకు వచ్చి నిలుస్తోందని, తలుపులు తెరిచి ఆదరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మహారాష్ట్రతో తెలంగాణది 'రోటీ బేటీ' బంధమని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ను మహారాష్ట్ర మీదుగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు మహారాష్ట్ర నేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి రాయితీలు ఇస్తున్నాయని... వ్యవసాయాధారిత భారత్‌లో పాలకులు అందుకు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. దేశ రైతులను రక్షించుకుంటూ వ్యవసాయాన్ని సుసంపన్నం చేద్దామని. కిసాన్ సర్కార్‌తో జీవితాల్లో వెలుగులు నింపుదామని తెలిపారు.
దేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని పేర్కొన్నారు. తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను మరోసారి సోలాపుర్ వస్తానని. వారం రోజుల ముందు మంత్రి హరీశ్‌రావును అక్కడికి పంపిస్తానని తెలిపారు. పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీతీసి... కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుందామని అన్నారు. మీరు పార్టీని గెలిపించుకోండి. మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా నేను తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.