తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. చాలా అంశాల్లో తమిళిసైది వితండవాదమని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. మంత్రులు సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
CM KCR on Tamilisai: గవర్నర్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!! - CM KCR on Governor
CM KCR ON GOVERNOR: మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని, పర్యటనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు తెలిసింది.
గవర్నర్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు!!