తెలంగాణ

telangana

ETV Bharat / state

చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా వెలుగుతోంది తెలంగాణ: కేసీఆర్​ - తెరాస ప్లీనరీ

CM KCR in Plenary: ప్రపంచంలోకెల్లా అత్యధిక యువశక్తి భారత్‌లో ఈ పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు. మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు అంటూ ప్రశ్నించారు. దేశ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాల్లో విద్యుత్​ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. కానీ చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మణిదీపంలా వెలుగుతోందని ఆయన అన్నారు.

చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా వెలుగుతోంది తెలంగాణ: కేసీఆర్​
చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా వెలుగుతోంది తెలంగాణ: కేసీఆర్​

By

Published : Apr 27, 2022, 12:21 PM IST

Updated : Apr 27, 2022, 1:22 PM IST

CM KCR in Plenary: తెరాస ప్రభుత్వ స్థాయిలో కేంద్రం పనిచేసి ఉంటే మన స్థాయి రూ.14.50 లక్షలుగా ఉండేదని సీఎం కేసీఆర్​ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో దేశం ప్రజలకు లభించలేదని ఆయన అన్నారు. అవాంఛితమైన, అనవసరమైన పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయన్న సీఎం.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలు సమాజంలో అవసరం లేదన్నారు. దేశం ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి ఈ పెడధోరణులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో నిరంతర వెలుగుజిలుగులు: దేశ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. చదువుకున్న వాళ్లకు కూడా కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేదని సీఎం అన్నారు. మోదీ నేతృత్వం వహించిన గుజరాత్‌లోనూ విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలున్నాయని.. ప్రకటిత, అప్రకటిత కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్‌తో వెలుగుజిలుగులు కనిపిస్తున్నాయని.. చుట్టూ అంధకారం ఉంటే తెలంగాణ మణిదీపంలా వెలుగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది: దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటి లభ్యత 65 వేల టీఎంసీలు ఉందన్న ముఖ్యమంత్రి.. మరో 4, 5 టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉందన్నారు. 65 టీఎంసీలకు గాను కేవలం 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోందన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో నీటియుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కావేరి జలాల కోసం తమిళనాడు- కర్ణాటక మధ్య యుద్ధం.. సింధూ- సట్లేజ్‌ నదీ జలాల కోసం పంజాబ్‌- హరియాణ మధ్య యుద్ధం జరగుతోందని వెల్లడించారు. నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడిందని.. తాగునీరు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రశ్నించారు.

ఈ పరిస్థితి ఎందుకు?: ప్రపంచంలోకెల్లా అత్యధిక యువశక్తి భారత్‌లోనే ఉందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. కానీ భారత పౌరులు విదేశాల్లో తమ శక్తిసామర్థ్యాలను ధారపోస్తున్నారని తెలిపారు. మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కనీసం మట్టి, మంచినీళ్లు కూడా సరిగా లేని సింగపూర్‌లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?.. మన వద్ద అన్నీ ఉన్నా... ఎందుకు ఈ పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.

స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో దేశం ప్రజలకు లభించలేదు. అనవసరమైన పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి. ఇలాంటి దురాచారాలు, దురాగతాలు సమాజంలో అవసరం లేదు. దేశం ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి ఈ పెడధోరణులు పెరుగుతున్నాయి. దేశ పరిరక్షణ కోసం మనం కృషిచేయాల్సిన అవసరముంది. చదువుకున్న వాళ్లకు కూడా కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేదు. గుజరాత్‌లోనూ విద్యుత్‌ కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలున్నాయి. ప్రకటిత, అప్రకటిత కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్‌తో వెలుగుజిలుగులు కనిపిస్తున్నాయి. -సీఎం కేసీఆర్​

చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా వెలుగుతోంది తెలంగాణ

ఇవీ చదవండి:

Last Updated : Apr 27, 2022, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details