తెలంగాణ

telangana

ETV Bharat / state

cm kcr on central: 'మీకేం పనిలేదా.. మళ్లీ వచ్చారని అన్నారు' - సీఎం కేసీఆర్​ ప్రెస్​మీట్​

సాగురంగాన్ని మొత్తం కేంద్రం... అంబానీ, అదానీ(ambani, adani) చేతిలో పెట్టాలని చూసిందని సీఎం కేసీఆర్​ విమర్శించారు (cm kcr on paddy procurement). వాస్తవం గ్రహించిన ఉత్తరాది రైతులు ఉద్యమానికి దిగారని... రైతుల పోరాటం, యూపీ ఎన్నికలు చూసి సాగు చట్టాలు రద్దు చేశారని పేర్కొన్నారు. వద్దంటే వినకుండా సాగుచట్టాలు చేసి 700 మంది రైతులను చంపారని ఆరోపించారు.

cm kcr
cm kcr

By

Published : Nov 29, 2021, 8:04 PM IST

cm kcr on modi: ధాన్యం కొనమని వెళితే 'మీకేం పనిలేదా.. మళ్లీ వచ్చారని' కేంద్రమంత్రి అన్నారని కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణలో 60 లక్షల ఎకరాలు సాగుకావటం లేదని మాట్లాడారని అన్నారు. రైతులు పండించిన తర్వాత కేంద్రం కొనకుంటే పరిస్థితి ఏంటని కేసీఆర్​ ప్రశ్నించారు. కల్తీ విత్తనాల(fake seeds) మీద పీడీయాక్టు(pd act) తెచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని.. భాజపా పాలిత రాష్ట్రాల కంటే కోటి రెట్లు మెరుగ్గా తెలంగామ ఉందని స్పష్టం చేశారు. కేంద్రాన్ని ఒప్పించే ధైర్యం లేని కిషన్‌రెడ్డి(kishan reddy) ఇక్కడ అసత్యాలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రపంచ ఆకలిసూచీలో(hunger index) భారత్‌ 101వ స్థానంలో ఉందని... పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే హీన స్థితిలో ఉన్నామని కేసీఆర్​ పేర్కొన్నారు. ప్రజలకు ఆహారం లేక చస్తుంటే.. నిల్వలు అధికంగా ఉన్నాయని అంటున్నారని... నిల్వలు ఎక్కువుంటే దేశ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు భాజపా(bjp govt) హయాంలో ఆకలిచావులు పెరిగాయని సర్వేలు చెప్తున్నాయని... పేర్కొన్నారు.

రైతులను తొక్కించింది వారే కదా..!

రైతులను కార్లు, ట్రాక్టర్లతో తొక్కించింది భాజపా నేతలు, మంత్రులే కదా అని సీఎం కేసీఆర్​ ఆరోపించారు. ఏడాది తర్వాత తప్పు తెలుసుకుని ప్రధాని మోదీ క్షమాపణ చెప్పలేదా అని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచింది మోదీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ధరలు వాళ్లు పెంచి, వ్యాట్‌ తగ్గించాలని రాష్ట్రాలను అడుగుతారా అని నిలదీశారు.

ఇదీ చూడండి:Sabitha review on corona: 'కొన్నిచోట్ల స్కూళ్ల యాజమాన్యాల నిర్లక్ష్యం కనిపిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details