గూడ అంజయ్య ఆశయాలను నిజం చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ సబ్బండ వర్గాల అభివృద్ధికి పాటు పడుతున్నామని తెలిపారు. గూడ అంజయ్య వర్థంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకున్నారు.
CM KCR: గూడ అంజయ్య సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్ - telangana news
ప్రముఖ గేయ కవి, కథా రచయిత గూడ అంజయ్య వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంజయ్య సబ్బండ వర్గాల అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉద్యమ కాలంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారని ప్రశంసించారు.
![CM KCR: గూడ అంజయ్య సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్ గూడ అంజయ్య సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12210276-351-12210276-1624265629542.jpg)
గూడ అంజయ్య సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్
జీవన తాత్వికత, సాంస్కృతిక చైతన్యానికి అంజయ్య పాట చిరునామా అని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వయం పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే అంజయ్య ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:kcr: ఆచార్య జయశంకర్ యాదిలో సీఎం కేసీఆర్
Last Updated : Jun 21, 2021, 4:46 PM IST