తెలంగాణ

telangana

ETV Bharat / state

జయశంకర్​ ఆశయ సాధనకు పునరంకితం: సీఎం కేసీఆర్​ - జయశంకర్​ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్​

ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సేవలను తలచుకున్నారు.

CM KCR commemorating Jayashankar's services
జయశంకర్​ సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్​

By

Published : Aug 6, 2020, 12:08 PM IST

తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ఆచార్య జయశంకర్ సదా స్మరణీయుడని సీఎం కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు.

జయశంకర్ ఆశించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే ఆయన ఆశయ సాధన అని కేసీఆర్ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రులు, ఇతర నేతలు ఆయనకు నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి :తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details