ప్రచారానికి సర్వం సిద్ధం
నేటి నుంచే గులాబీ దళపతి మలిదశ ప్రచారం - తెరాస బహిరంగ సభ
గులాబీ దళపతి మలిదశ ప్రచారం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు 13 నియోజకవర్గాల్లో 11 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇవాళ మిర్యాలగూడ, హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఎండ తీవ్రత కారణంగా రోజూ రెండు సభలు సాయంత్రం వేళల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రచారానికి సర్వం సిద్ధం
ఈరోజు మిర్యాలగూడ, హైదరాబాద్‌లలో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు
Last Updated : Mar 29, 2019, 7:25 AM IST